Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అక్కినేని ఎన్నో గుప్తదానాలు చేశారు : డాక్టర్ కృష్ణక్క

  • అక్కినేనికి కష్టం విలువ తెలుసు 
  • అడిగిన వారికి సాయం చేసేవారు 
  • ఎవరికి ఏమిచ్చింది వేరేవారికి తెలియనిచ్చేవారు కాదు  
అక్కినేని చాలా కింది స్థాయి నుంచి వచ్చారు గనుక .. ఆయనకి కష్టం విలువ తెలుసు. అందువలన ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్లకి గుప్తదానం చేసేవారు. డబ్బు తీసుకున్నవాళ్లు మళ్లీ ఎప్పుడు ఇవ్వమంటారు? అని అడిగితే, నవ్వి ఊరుకునే వారు. ఎవరికి ఏమిచ్చారనే విషయం వేరెవరికీ తెలియనిచ్చే వాళ్లు కాదు.

 "నేను ప్రత్యక్ష సాక్షిని .. నా కళ్ల ముందే ఆయన ఎన్నో గుప్తదానాలు చేశారు. ఆయన గురించి తెలియనివాళ్లు .. ఆయన ఎవరికేం చేశాడు? .. డబ్బులు లెక్కపెట్టుకుంటూ వుంటారు .." అని అంటూ వుంటారు. "కష్టార్జితం విలువ తెలుసు కనుక లెక్కపెట్టుకుంటారు .. సద్వినియోగం చేసుకుంటారు. అందుకే ఆయన "సంపాదించడం అంటే నాకు ఎంతో ఇష్టం .. సద్వినియోగం చేసుకోవడం అంటే అంతకి మించిన ఇష్టం" అని అంటూ వుండేవారు.    
 

akkineni

More Telugu News